17-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జనవరి 17: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అధికారిక ఎక్స్ అకౌంట్ హ్యాకింగ్కు గురైంది. హ్యాకర్లు ఖాతాలో ఎటువంటి సందేశాలను పోస్ట్ చేయలేదు, కానీ దాని యాక్సెస్ ను స్వాధీనం చేసుకున్నారు.హ్యాకింగ్ గురించి మైక్రోబ్లాగింగ్ సైట్ యాజమాన్యాన్ని పోలీసులు సంప్రదించినట్లు సమాచారం. నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ మధ్య రాజకీయ నేతలకు సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్లు హ్యాక్
అవుతున్నాయి. సంబంధం లేని పోస్టులు పెడుతున్నారు. ఇటీవల మంత్రి దామోదర రాజనర్సింహ ఫేస్ బుక్ అకౌంట్ ను కేటుగాళ్లు హ్యాక్ చేశారు. దీనిపై ఆయన సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైట్ చేశారు.