17-01-2024 RJ
తెలంగాణ
ఆదిలాబాద్, జనవరి 17: అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు డీసీసీబీ ఛైర్మన్ అడ్డి భోజారెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఆదిలాబాద్ పట్టణంలోని ప్రజా సేవా భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. డబ్బు కోసమే పార్టీ మారినట్లు మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న చేసిన వ్యాఖ్యలను ఖండించారు.
డబ్బు కోసం రాజకీయం చేసిన చరిత్ర రామన్నదే అన్నారు. రిమ్స్ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను అమ్ముకున్నారని ఆరోపించారు. అమ్ముడు పోయారన్న వ్యాఖ్యలపై దీపాయిగూడలోని హనుమాన్ మందిరంలో ప్రమాణం చేయడానికి రావాలని సవాల్ చేశారు. కాంగ్రెస్ నాయకులు వెంకట్ రెడ్డి, జంగు పటేల్, భోజారెడ్డి, సుజాత్ అలీ, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.