17-01-2024 RJ
తెలంగాణ
ఆదిలాబాద్, జనవరి 17: కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న హిట్ అండ్ రన్ చట్టానికి వ్యతిరేకంగా ఆదిలాబాద్ లో లారీ డ్రైవర్లు, క్లీనర్ల సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ చట్టం వల్ల నిరుపేద డ్రైవర్లు ఇబ్బందులకు గురవుతారని ఆ సంఘం నాయకులు తెలిపారు. హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు.