17-01-2024 RJ
సినీ స్క్రీన్
హీరో రామ్చరణ్-ఉపాసనల కుమార్తె క్లీంకారకు చిరంజీవి అభిమానులు తమ అభిమానాన్ని పాట రూపంలో తయారుచేసి పంపించారు. సంక్రాంతి సందర్భంగా ఆ పాటను తల్లి ఉపాసన విడుదల చేశారు. ప్రస్తుతం నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్న ఈ వీడియోను ఎక్కువమంది వీక్షిస్తున్నారు. 'కిలకిలా నవ్వింది క్లీంకార.. జగమంతా దీవించే మనసారా' అంటూ సాగే ఈ పాటను రఘు బెల్లంకొండ రాశారు.
ధనుంజరు ఆలపించారు. 'చిన్నారి కోసం మేము అందించిన చిరు కానుక ఉపాసనకు నచ్చడం మా అదృష్టం' అని రఘు సంతోషాన్ని వ్యక్తంచేశారు. చిరంజీవి- అల్లు అరవింద్ కుటుంబ సభ్యులంతా బెంగుళూరులో సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు.