17-01-2024 RJ
సినీ స్క్రీన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓ గుడ్ న్యూస్. ప్రజెంట్ పాలిటిక్స్ మీద ఆయన ఫుల్ కాన్సంట్రేట్ చేశారు. అందువల్ల, షూటింగులకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఆయన షూటింగ్ చేయడం లేదు గానీ... ఆయనతో సినిమాలు చేస్తున్న దర్శక నిర్మాతలు సినిమా మీద వర్క్ చేయడం ఆపలేదు. పవన్ నటిస్తున్న క్రేజీ సినిమాల్లో 'ఓజీ' ఒకటి. దీని గురించి సంగీత దర్శకుడు తమన్ ఓ అప్డేట్ ఇచ్చారు.
వన్ కళ్యాణ్ స్టార్ హీరో. ఆయన హీరో మాత్రమే కాదు... ఆయనలో ఓ సింగర్ కూడా ఉన్నారు. ఆయనతో పాట పాడించాలని తమన్ ప్లాన్ చేస్తున్నారు. 'సాహో' ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమా 'ఓజీ'. ఆ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ 'ఓజీ' స్క్రిప్ట్ లో పవన్ గారి చేత పాడించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి.
మేం ఆ అవకాశాలను పరిశీలిస్తున్నాం' అని చెప్పారు. పవన్ కళ్యాణ్ గనుక ఓకే అంటే... 'ఓజీ'లో ఆయన పాటను మనం వినొచ్చు. ఈ సినిమా కోసం ఆల్రెడీ తమన్ కొన్ని ట్యూన్స్ ఇచ్చారు. అందులో ఓ పాటను పుణెలో షూటింగ్ కూడా చేశారు. 'ఓజీ'లో పవన్ సరసన యంగ్ హీరోయిన్ ప్రియాంకా అరుల్ మోహన్ నటిస్తున్నారు. వాళ్లిద్దరిపై ఆ పాట తీశారు.
ఇంతకు ముందు 'తమ్ముడు' సినిమాలో 'ఏం పిల్ల మాటాడవా' పాటతో మొదలు పెడితే... అందులోనే 'తాటి చెట్టు' నుంచి 'ఖుషి' సినిమాలో 'బై బయ్యే బంగారు రవణమ్మ...', 'జానీ' సినిమాలో 'నువ్వు సారా తాగకు', 'రావోయి మా ఇంటికి', 'పంజా'లో 'పాపారాయుడు', 'అత్తారింటికి దారేది'లో 'కాటమరాయుడు', 'అజ్ఞాతవాసి' సినిమాలో 'కొడకా కోటేశ్వర్ రావు' పాటలు పాడారు.