ad1
ad1
Card image cap
Tags  

  18-01-2024       RJ

ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా చంద్రబాబు నివాళి

తెలంగాణ

అమరావతి, జనవరి 18: దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కలను నిజం చేయడమే తెలుగు ప్రజల కర్తవ్యం కావాలని మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి బాబు నివాళులర్పించారు. రామరాజ్య స్థాపనకు ఎన్టీఆర్ స్ఫూర్తిగా మనందరం కదలాలన్నారు. తెలుగు ప్రజలారా రండి అంటూ.. ఆనాటి రామన్న రాజ్యం తిరిగి సాధించుకుందామని, దేశంలో సంక్షేమ పాలనకు ఎన్టీఆర్ ఆధ్యుడు అని బాబు ప్రశంసించారు.

ఒకే ఒక జీవితం రెండు తిరుగులేని చరిత్రలు ఉన్నాయని కొనియాడారు. తెలుగు జాతికి తరతరాలకు సరిపడా ఖ్యాతిని వారసత్వంగా ఇచ్చారని మెచ్చుకున్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తిగా అందరం కదిలి తిరిగి రామరాజ్య స్థాపనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. బలహీన వర్గాల అణచివేత, పేదలను ఇంకా పేదలుగా మారుస్తున్న పాలన, సమాజంలో ఏ ఒక్కరికీ దక్కని భద్రతలతో తెలుగునేల అల్లాడుతోందని, ఎన్టీఆర్ ఆనాడు 'తెలుగుదేశం పిలుస్తోంది. రా... కదలిరా!' అని ఇచ్చిన పిలుపును స్ఫూర్తిగా తీసుకొని 'రా... కదలిరా!' కార్యక్రమానికి పిలుపునిచ్చానని చంద్రబాబు పేర్కొన్నారు.

తెలుగు ప్రజలరా! రండి... ఆనాటి రామన్న రాజ్యాన్ని తిరిగి సాధించుకుందాం. ఎన్టీఆర్కు అసలైన నివాళి అర్పించుదాం అని చంద్రబాబు పిలుపునిచ్చారు. దేశంలో సంక్షేమ పాలనకు ఆద్యుడు ఎన్టీఆర్ అని చంద్రబాబు కొనియాడారు. ఒకే ఒక జీవితం... రెండు తిరుగులేని చరిత్రలు. కృషి, పట్టుదల, క్రమశిక్షణ అనే ఆయుధాలతో ఒక రైతుబిడ్డ సాధించిన అద్వితీయ విజయానికి ప్రతీక నందమూరి తారక రామారావు.

తెలుగునాట నిరుపేదకు అలనాటి రామరాజ్య సంక్షేమాన్ని అందించిన మానవతావాది... తెలుగు జాతికి తరతరాలకు సరిపడా ఖ్యాతిని వారసత్వంగా ఇచ్చిన తెలుగు వెలుగు ఎన్టీఆర్. పేదరికం లేని సమాజాన్ని, కులమతాలకు అతీతమైన సమసమాజాన్ని స్థాపించాలన్న ఎన్టీఆర్ కలను నిజం చేయడమే మన కర్తవ్యం కావాల ని చంద్రబాబు పేర్కొన్నారు.

08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

03, Sep 2024

బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుంది: సీఎం రేవంత్

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP