18-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జనవరి 18: ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. ఎన్నికల ముందు అదానీ దొంగ అని విమర్శించిన రేవంత్ రెడ్డి.. సీఎం అయ్యాక దావోస్ సాక్షిగా అదానీతో అలయ్ బలయ్ చేసుకున్నారని విమర్శించారు. ప్రధాని మోదీ- అదానీ ఒకటేనని రాహుల్ అంటున్నారని.. మొన్న రేవంత్ కూడా అదానీ-మోదీ ఒకటేనని విమర్శించారని గుర్తు చేశారు.
ఢిల్లీలో అదానీతో కొట్లాడుతూ తెలంగాణలో మాత్రం అదానీతో కలిసి ఎందుకు పనిచేస్తున్నారో చెప్పాలని రేవంత్ రెడ్డిని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ ఏడాదిలో వరుసగా వివిధ ఎన్నికలు ఉ న్నాయని.. వీటిని ఎదుర్కోవడం కోసం పార్టీ సంసిద్ధంగా ఉండాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. గురువారం పార్టీ ఎమ్మెల్సీలతో సమావేశం అయిన ఆయన.. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉండే అవకాశం ఉందన్నారు.
ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు అవకాశాలు బలంగా ఉన్నాయని నమ్మకం వెలిబుచ్చారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎమ్మెల్సీలు విస్తృతంగా పనిచేయాలని కోరారు. జిల్లా కేంద్రంగా పార్టీ కార్యక్రమాలను మరింత యాక్టివేట్ చేస్తామన్నారు. త్వరలోనే మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలతో సమావేశం ఉంటుందని.. అందులోనే శాసన మండలి పార్టీ నేతను ఎన్నుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీల అమలు కోసం శాసనసభలో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒత్తిడి కొనసాగిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని కాంగ్రెనకు గుర్తు చేస్తామన్నారు. హామీలను అమలు చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తే.. అసెంబ్లీలో ఉన్న బలమైన ప్రతిపక్షాలు శాసనసభ వేదికగా ప్రశ్నిస్తాయని హెచ్చరించారు. శాసనమండలి సభ్యులు పార్టీకి కళ్లు, చెవుల మాదిరిగా పని చేయాలని అన్నారు.
శాసనమండలి సభ్యులు తమ నియోజకవర్గాల్లోని పార్టీ శ్రేణులతో నమన్వయం చేసుకోవాలన్నారు. పార్టీని గ్రామస్థాయి నుంచి పోలిట్ బ్యూరో వరకు పునర్వ్యవ స్థీకరించాలని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ భావిస్తున్నారని చెప్పారు. చురుకైన నాయకులు, కార్యకర్తల సేవలను పార్టీ ఉ పయోగించుకుంటుందని కేటీఆర్ చెప్పుకొచ్చారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ మహబూబ్ నగర్ లోకసభ నియోజకవర్గ సన్నాహక సమావేశం జరిగింది.
సభకు మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, వీ శ్రీనివాన్ గౌడ్, లక్ష్మారెడ్డి, కడియం శ్రీహరి, మాజీ స్పీకర్లు పోచారం శ్రీనివాస్ రెడ్డి, మధుసూదనాచారి, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని నేతలు హాజరయ్యారు.