18-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జనవరి 18: తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. రెండు స్థానాల కోసం ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులు నుంచి మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. ఇక, ఎవరూ నామినేషన్లు వేయకపోవడంతో బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్లు వేశారు.
నామినేషన్ దాఖలుకు గురువారం ఆఖరి రోజు కావడంతో కాంగ్రెస్ అభ్యర్థులు మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్లు నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఇదిలా ఉండగా.. ప్రతిపక్షాల నుంచి ఎవరూ నామినేషన్ వేయలేదు. దీంతో, వీరి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. మరోవైపు..
శుక్రవారం నామినేషన్ల పరిశీలన కొనసాగనుంది. ఈనెల 22వ తేదీ వరకు నామినేషన్ల ఉప సంహరణకు గడువు ఉంది. అదే రోజున మధ్యాహ్నం మూడు గంటలకు అభ్యర్థుల ఎన్నికపై ప్రకటన వెలువడనుంది.