19-01-2024 RJ
సినీ స్క్రీన్
ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్ కోసం పోటీ మొదలయిపోతోంది. ఇప్పటికీ ఎన్నో సినిమాల విషయంలో అదే జరిగింది. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి 'దేవర' కూడా యాడ్ అయ్యింది. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో మూవీ అని తెలియగానే ప్రేక్షకుల్లో విపరీతంగా ఆసక్తి పెరిగిపోయింది. ఇక ఇందులో ఎన్టీఆర్ లుక్తో పాటు టైటిల్ రివీల్ చేయగానే ఫ్యాన్స్ అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.
అప్పటినుండే ఈ మూవీ ఓటీటీ రైట్స్ కోసం సంస్థలు పోటీపడ్డాయి. నైల్ 'దేవర' ఓటీటీ రైట్స్ ను రికార్డ్ ప్రైజ్ తో నెట్ ఫ్లెక్స్ సొంతం చేసుకుందని సమాచారం. కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఇప్పటికే 'జనతా గ్యారేజ్' సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఒక మంచి మెసేజ్ ఓరియెంటెడ్ కథకు కమర్షియల్ ఎలిమెంట్స్ ను జోడించి హిట్ కొట్టడం కొరటాల శివ స్టైల్.
అలాంటిది ఈసారి ఎన్టీఆర్ తో 'దేవర' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదలయినప్పటి నుండి కొరటాల ముందు సినిమాల్లో లేని డిఫరెంట్ ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయని ప్రేక్షకులు బలంగా నమ్మడం మొదలుపెట్టారు. పైగా ఇందులో వైలెన్స్ కూడా బాగానే ఉంటుందని దర్శకుడు చెప్పుకొచ్చాడు. దానికి తగినట్టుగానే తాజాగా విడుదలయిన 'దేవర' గ్లింప్స్ కూడా పూర్తి యాక్షన్ తో ఉంది.