19-01-2024 RJ
సినీ స్క్రీన్
మాస్ కా దాస్ విశ్వక్సేన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రాల్లో ఒకటి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. విశ్వక్ సేన్ 11 గా వస్తోన్న ఈ చిత్రానికి ఛల్ మోహన్ రంగ ఫేం కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నాడు. డీజే టిల్లు ఫేం నేహాశెట్టి, అంజలి ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ఇటీవలే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. విశ్వక్ సేన్ ఊరమాస్ అవతార్ చేతిలో పందెం కోడి పట్టుకుని కనిపిస్తున్న కొత్త లుక్ విడుదల చేయగా నెట్టింట వైరల్ అవుతోంది.
తాజా టాక్ ప్రకారం ఈ మూవీ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. షూటింగ్ మొత్తం ఈ నెల చివరి నాటికి పూర్తి కానుంది. షూట్ పూర్తవగానే విశ్వక్సేన్ ప్రమోషన్స్ పై ఫోకస్ పెట్టనున్నాడని ఇన్ సైడ్ టాక్. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ ను నెక్స్ట్ లెవల్లో చూపించ బోతున్నట్టు ఇప్పటివరకు వచ్చిన రషెస్, లుక్స్ చెబుతున్నాయి.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నుంచి మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన ఫస్ట్ సింగిల్ సుట్టంలా సూసి పోకలా లిరికల్ వీడియో సాంగ్ నెట్టింట మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతోంది. ఈ మూవీని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార సంస్థ బ్యానర్ తో కలిసి ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.