19-01-2024 RJ
తెలంగాణ
రంగారెడ్డి, జనవరి 19: రంగారెడ్డి జిల్లా నార్సింగిలో విషాదం చోటుచేసుకున్నది. నార్సింగి అల్కాపురి కాలనీలో ఉన్న మదర్సాలో విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నది. దీంతో బాలుడు మృతి చెందాడు. బీహార్ కు చెందిన 12 మంది విద్యార్థులు మదర్సాలో ఉంటున్నారు. గురువారం రాత్రి చిన్న వివాదంలో పన్నేండ్ల మహ్మద్ రకీమ్ పై తోటి విద్యార్థులు దాడిచేశారు.
తీవ్రంగా గాయపడిన అతడు అక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో మదర్సా సిబ్బంది రకీమ్ ను హుటాహుటిన గోల్కొండలోని దవాఖానకు తరలించారు. అయితే అతడు అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.