ad1
ad1
Card image cap
Tags  

  19-01-2024       RJ

మూడు దశబ్దాల ఎమ్మార్పీఎస్ పోరాటం సఫలం

తెలంగాణ

హైదరాబాద్, జనవరి 19: ఎస్సీ వర్గీకరణపై కేంద్రంలో కదలిక వచ్చింది. దీనిపై అధ్యయనంతో పాటు వివిధ వర్గాల అభిప్రాయాలు తీసుకునేందుకు కేంద్రం ఓ కమిటీ ఏర్పాటు చేసింది. ఇందులో ఐదుగురు సభ్యులు ఉంటారు. దీనికి కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నాయకత్వంలో కమిటీ పనిచేయ నుంది. దీంతో దశాబ్దాల పోరాటానికి ఫలితం దక్కిందని ఎమ్మార్పీఎస్ నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోడీ ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారని మందకృష్ణ మాదిగ అన్నారు.

ఈ మేరకు ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ హైదరాబాద్ లో జరిగిన సభలో ప్రధాని మోదీ దీనిపై హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన చేసిన కొద్ది రోజులకే షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ కోసం కమిటీ నియమిస్తున్నట్లుగా ప్రధాని మోదీ అదేశాలు ఇచ్చారు. ఇన్నాళ్లకు ఇప్పుడు కమిటీ ఏర్పాటు అయింది. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి గత 30 ఏళ్లుగా ఈ వర్గీకరణ కోసం పోరాడుతోంది. దీన్ని మందక్రిష్ణ మాదిగ ప్రారంభించారు.

గత మూడు దశాబ్దాలుగా జరిగిన ప్రతి పోరాటంలో బీజేపీ వారికి అండగా నిలుస్తోందని హైదరాబాద్ సభలో మోదీ హామీ ఇచ్చారు. ఈ పక్రియను వీలైనంత త్వరగా పరిష్కరించ డానికి తాము కట్టుబడి ఉన్నామని అన్నారు. మాదిగలకు సాధికారత కల్పించడానికి ఓ కమిటీని త్వరలో ఏర్పాటు చేస్తామని అప్పుడు హామీ ఇచ్చారు. ఎమ్మార్పీఎస్ పోరాటం న్యాయమైనదని తాము భావిస్తున్నట్లు చెప్పారు. మాదిగలు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని షెడ్యూల్డ్ కులాలలో (ఎస్సీ) ఎక్కువ భాగం ఉన్నారు.

దీనివల్ల ఉద్యోగాలు సహా ఇతర విషయాల్లో రిజర్వేషన్లు, ఇతర బెనిఫిట్స్ తమకు అందడం లేదని వాదన వారిలో ఉంది. అందుకే ఎమ్మార్పీఎస్ గత మూడు దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతోంది. రాజీవ్ గౌబా నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసిన కేంద్రం అందులో పలు కీలకమైన శాఖలకు స్థానం కల్పించింది. ఈ కమిటీలో కేంద్ర హోంశాఖ, న్యాయశాఖ, గిరిజన శాఖ కార్యదర్శులను భాగం చేసింది. వీలైనంత త్వరగా కమిటీ రిపోర్టు ఇవ్వాలని ఆదేశించింది. కేంద్ర ఆదేశాల మేరకు త్వరగా రిపోర్టు ఇవ్వడానికి సమాయత్తమైన కమిటీ.. ఈ నెల 22న తొలిసారిగా సమావేశం కానుంది.

ప్రభుత్వానికి త్వరగా రిపోర్ట్ ఇవ్వడానికి అనుసరించాల్సిన వ్యూహాంపై చర్చించనున్నారు. ఎస్సీ రిజర్వేషన్లలో సబ్-కేటగిరైజేషన్ ప్రక్రియలో భాగంగా ఒక కమిటీని త్వరగా ఏర్పాటు చేయాలని నవంబరు 24నే కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా, ఇతర సీనియర్ అధికారులను ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు.

08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

03, Sep 2024

బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుంది: సీఎం రేవంత్

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP