19-01-2024 RJ
తెలంగాణ
మహబూబ్ నగర్, జనవరి 19: జిల్లాలోని అడ్డాకుల 44వ జాతీయ రహదారిపై ప్రైవేటు బస్సుకు పెను ప్రమాదం తప్పింది. అడ్డాకుల సబ్ స్టేషన్ సమీపంలో జాతీయ రహదారి 44 పై కర్నూలు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న వోల్వో బస్సు వేగంగా వెళ్తున్న క్రమంలో టైరు ఊడిపోయి మంటలు చెలరేగాయి.
ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్ అప్రమత్తతో బస్సును రోడ్డు పక్కన ఆపి మంటలార్పడంతో ప్రమాదం తప్పింది. బస్సులో 30 మంది ప్రయాణికులున్నారు. తృటిలో భారీ ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.