19-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జనవరి 19: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు కృషి చేస్తామని మాజీమంత్రి, సనత్ నగర్ సనత్ నగర్ లోని మోడల్ కాలనీలో.. ఎమ్మెల్యే తలసాని పర్యటన తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం సనత్ నగర్ లోని మోడల్ కాలనీలో గల పూజిత అపార్ట్మెంట్ ను వివిధ శాఖల అధికారులతో కలిసి సందర్శించి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అపార్ట్మెంట్ ముందు ఉన్న జీహెచ్ఎంసీ స్థలంలో పార్క్ ను అభివృద్ధి చేసి వినియోగంలోకి తీసుకురావాలని, పుట్ పాత్ ను అభివృద్ధికి చేయించాలని సనత్ నగర్ లోని మోడల్ కాలనీలో.. ఎమ్మెల్యే తలసాని పర్యటన తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కోరారు. స్పందించిన మంత్రి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ సందర్బంగా ఆయన అపార్ట్మెంట్ వాసులను ఉద్దేశించి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో తన దృష్టికి పలు సమస్యలను తీసుకురావడం జరిగిందని, వాటిని పరిష్కరించే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. ప్రజల అవసరాలను గుర్తించి అందుకు అనుగుణంగా అభివృద్ధి పనులను చేస్తూ వస్తున్న విషయాన్ని గుర్తుచేశారు.
ఈఎస్ఐ స్మశాన వాటికను పూర్తిస్థాయిలో అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేసే పనులు చేపట్టడం జరిగిందని, కెఎల్ యెన్ పార్క్ లో కూడా వాకర్స్, యోగా కోసం వచ్చే వారికి కావాల్సిన సౌకర్యాలను కల్పిస్తూ ఎంతో అద్బుతంగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. అపార్ట్మెంట్ లో నెలకు 20 వేల లీటర్ల వరకు ఉచితంగా త్రాగునీటి సరఫరా జరుగుతుందని తెలిపారు. త్వరలోనే ఈఎస్ఐ రోడ్డు విస్తరణ పనులు చేపట్టి వాహనదారుల ఇబ్బందులను తొలగించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సనత్ నగర్ లోని మోడల్ కాలనీలో..
ఎమ్మెల్యే తలసాని పర్యటన తలసాని శ్రీనివాస్ యాదవ్ వెంట కార్పొరేటర్ కొలను లక్ష్మి బాల్ రెడ్డి, పూజిత అపార్ట్మెంట్ అద్యక్షులు వీరారెడ్డి, శశిధర్ రెడ్డి, డిసి జగన్, ఈఈ ఇందిర, జెఎస్ టి సాయి, బుచ్చిబాబు, డిఈ మోహన్, వాటర్ వర్క్స్ జిఎం హరి శంకర్, హార్టికల్చర్ డిడి శ్రీనివాస్, టౌన్ ప్లానింగ్ అబ్దుల్ ఫహీం, శానిటేషన్ అధికారి రవి, వెటర్నరీ అధికారి ప్రతాప్, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అద్యక్షులు కొలను బాల్ రెడ్డి, నాయకులు శేఖర్, సరాఫ్ సంతోష్, సురేష్ గౌడ్, పుష్పలత, జమీర్, సమి ఉల్లా, టి.శ్రీహరి ఆకుల హరికృష్ణ, కిషోర్, ఆరీఫ్ తదితరులు ఉన్నారు.