19-01-2024 RJ
తెలంగాణ
కరీంనగర్, జనవరి 19: రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 22వ తేదీన సెలవుదినంగా ప్రకటించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ సూచించారు. అయోధ్య రామాలయ ప్రతిష్ట కోసం సెలవు ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ సందర్భంగా శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రజలు దేవుడి అక్షింతల కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారని, రామ మందిర నిర్మాణ నిధి సేకరణలో తెలంగాణ అగ్రభాగాన ఉందన్నారు. అక్షింతల్లో రకాలు వుండవని, రేషన్ బియ్యం అని వక్రీకరించడం తగదని హితవుపలికారు. దైవ కార్యాన్ని రాజకీయం చేయడం తగదన్నారు. కాంగ్రెస్ వాళ్లు కోరితే బాసుమతి బియ్యం పంపుతామని బండి సంజయ్ అన్నారు.