19-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జనవరి 19: ఎట్టకేలకు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు వచ్చిన బెదిరింపు కాల్స్ వ్యవహారంలో మంగళట్ పోలీసులు స్పందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కొన్ని రోజులుగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు కొంతమంది ఫోన్ చేస్తూ శ్రీరామనవమి శోభాయాత్ర నిర్వహిస్తే చంపుతామంటూ బెదిరించారు.
ఇదే విషయమై రాజాసింగ్ నగర కమిషనర్ తోపాటు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా గత రెండు రోజుల క్రితం సైతం ఓ వ్యక్తి ఫోన్ చేసి హైదరాబాద్ లోనే చంపుతానంటూ చాలెంజ్ చేయడంతో అదే విషయాన్ని రాజాసింగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ అంశంపై స్పందించిన మంగళ హాట్ పోలీసులు కేసు నమోదు చేసి వాటిపై ఆరా తీస్తున్నారు.