19-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జనవరి 19: రాష్ట్ర లెజిస్లేచర్ సలహాదారులుగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ప్రసన్నకుమార్ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని శాసనమండలి ప్రాంగణంలోని తన చాంబర్ లో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ప్రసన్న కుమార్ భారత రాజ్యాంగాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, తెలంగాణ లెజిస్లేచర్ సెక్రటరీ డా. నరసింహా చార్యులు తదితరులు పాల్గొన్నారు.