19-01-2024 RJ
సినీ స్క్రీన్
హన్సిక హీరోయిన్ గా రాజు దుస్సా దర్శకత్వంలో బొమ్మక్ శివ నిర్మాతగా వస్తున్న సినిమా '105 మినిట్స్'. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడులైన మోషన్ పోస్టర్, థీమ్ సాంగ్ మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ని మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాలో చేసిన పాత్ర గెటప్ లోనే హన్సిక స్టేజ్ పైకి వచ్చి ఈ ట్రైలర్ ని విడుదల చేయడం విశేషం. ఒకే పాత్రతో ఒకే షాట్ లో చిత్రీకరించబడిన మొట్టమొదటి ప్రయోగాత్మక చిత్రంగా '105 మినిట్స్' సినిమా తెరకెక్కింది.
జనవరి 26న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ట్రైలర్ విడుదల సందర్భంగా హీరోయిన్ హన్సిక మాట్లాడుతూ.. 105 మినిట్స్ సినిమా రిలీజ్ అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇది పూర్తిగా ప్రయోగాత్మక చిత్రం. 34 నిమిషాల షాట్ని సింగిల్ టేక్ లో చేయడం అనేది నాకు ఒక కొత్త అనుభవంలా అనిపించింది. 8 రోజులు రిహార్సల్స్ చేసిన షార్ట్ అది. ఇలాంటి ప్రయోగాలు సినిమాలో ఎన్నో ఉన్నాయి. ఈ మూవీకి నన్ను సెలెక్ట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. జనవరి 26న రిలీజ్ అవుతున్న మా సినిమాను ప్రేక్షకులు చూసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నానని అన్నారు.
కో ప్రొడ్యూసర్ సుమన్ మాట్లాడుతూ.. నిజంగా నిర్మాత బొమ్మక్ శివ గారికి ఎంతో గట్స్ ఉంటే గాని ఇలాంటి కంటెంట్ యాక్సెప్ట్ చేయడం కష్టం. ఇది ఒక మంచి కంటెంట్ ఉన్న థియేటర్ సినిమా. ప్రస్తుతం ఈ సినిమాని తెలుగులోనే వరల్డ్ వైడ్ రిలీజ్ చేసి తర్వాత డిఫరెంట్ లాంగ్వేజన్ లో పాన్ ఇండియా లెవెల్ లో తీసుకొస్తామని అన్నారు.
దర్శకుడు రాజు దుస్సా మాట్లాడుతూ.. మొట్టమొదటిసారిగా దర్శకత్వం వహిస్తున్న నన్ను నమ్మి, కంటెంట్ ని నమ్మి ఈ సినిమాని నిర్మించడానికి ముందుకు వచ్చిన నిర్మాత బొమ్మక్ శివ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.