19-01-2024 RJ
సినీ స్క్రీన్
నెట్ ఫ్లిక్స్ లో నేటి నుంచి స్ట్రీమింగ్ చాలా కాలం తర్వాత ప్రభాస్ ఖాతాలో మాస్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సినిమా సలార్. ఎన్నో అంచనాల మధ్య గతేడాది డిసెంబర్ 22న విడుదలైన ఈ మూవీ ఊహించని స్థాయిలో సెన్సెషన్ సృష్టించింది. బాహుబలి తర్వాత ఆ రేంజ్ హిట్ అందించిన మూవీ ఇదే కావడం విశేషం. ఈ సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
ఈ చిత్రాన్ని రెండు పార్టులుగా తీసుకువస్తున్నారు మేకర్స్. ఫస్ట్ పార్ట్ విజయంతో.. ఇప్పుడు సెకండ్ పార్ట్ పై మరింత హైప్ పెరిగింది. ఇదిలా ఉంటే.. ఇప్పటివరకు థియేటర్లలో సంచలనం సృష్టించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది. విడుదలైన నెల రోజుల్లోనే డిజిటల్ ప్లాట్ ఫాంలోకి రాబోతుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందని గతంలోనే అనౌన్స్ చేశారు మేకర్స్. కానీ రిలీజ్ డేట్ మాత్రం అనౌన్స్ చేయలేదు.
ఇక ఇప్పుడు స్టీమ్రింగ్ డేట్ ప్రకటించి ప్రేక్షకులకు సర్ ప్రైజ్ చేసింది నెట్ ఫ్లిక్స్. ఈ సినిమా జనవరి 20 నుంచే స్ట్రీమింగ్ కాబోతుందని తెలిపారు. అంటే మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి రాబోతుంది. ఇప్పుడు అభిమానులు, ప్రేక్షకులు ఆనందపడుతున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఆ తర్వాత హిందీలో ఈ మూవీ రిలీజ్ అవుతుందని తెలుస్తోంది.