20-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జనవరి 20: అయోధ్యలో నవ నిర్మిత భవ్య మందిరంలో 22 సోమవారం నాటి అభిజిత్ లగ్నంలో శ్రీరాంలాలా విగ్రహ ప్రతిష్టామహోత్సవ సుముహూర్తం.. సందర్భంగా మౌలాలి శ్రీరంగగిరి గోదాట్రస్ట్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అభిషేకాలు, పూజలు, అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు.
రామచద్రుడి ఆరాధ్య దైవం శ్రీరంగనాథుడు. ఆ స్వామి మహత్తును జగత్తుకు చాటిన జగదాచార్యులు భగవద్రామానుజులు. వీరి పేరిట వెలసిన మన రామానుజ సర్కిల్లో వేయిమందికి ఆరోజు స్వామికి నివేదించిన అన్నప్రసాదాన్ని వితరణ చేయడానికి పూనుకున్నట్లు తెలిపారు.
ఈ మహా అన్నదాన కార్యక్రమానికి ముందు ఉదయం అక్కడే ఉన్న బృహదాంజనేయ సన్నిధిలో శ్రీ సీతారామ సమేత ఆంజనేయుడికి విశేష ఆరాధన, మన్యుసూక్తపూర్వక అభిషేకం, శ్రీమద్రామాయణాంతర్గతమైన శ్రీరామజననం, పట్టాభిషేక సర్గల పారాయణం, హనుమాన్ చాలీసా సామూహిక గానం, హారతి తదితర విశేష కైంకర్యాలు వుంటాయని తెలిపారు.