ad1
ad1
Card image cap
Tags  

  20-01-2024       RJ

అరకు సభలో జగన్ పై చంద్రబాబు విమర్శలు

ఆంధ్రప్రదేశ్

విశాఖపట్నం, జనవరి 20: ఎంతో ప్రత్యేకత కలిగిన అరకు కాఫీని ప్రపంచానికి తాను పరిచయం చేసానని, అయితే ప్రస్తుత సిఎం మాత్రం గంజాయిని పరిచయం చేశారని టిడిపి అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎద్దేవా చేశారు. దావోసు ఇప్పటికే అరకు కాఫీ రుచి చూపించామన్నారు. అల్లూరి జిల్లా అరకులో నిర్వహించిన 'రా.. కదలి రా' బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.

తెదేపా అరకు కాఫీని ప్రమోట్ చేస్తే.. వైకాపా గంజాయిని ప్రోత్సహిందని విమర్శించారు. తనుకు బాగా ఇష్టమైన ప్రాంతం అరకు అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ప్రకృతి రమణీయతకు, ప్రశాంతతకు నిలయం అరకు అని, ఇక్కడ పండించే పంటలకు గిట్టుబాటు ధర రావడం లేదన్నారు. 'అరకు కాఫీ' అనే పేరును తానే పెట్టానని చంద్రబాబు అన్నారు. అరకు కాఫీని ప్రపంచానికి పరిచయం చేశామన్నారు.

టీడీపీ కాఫీని పరిచయం చేస్తే.. వైసీపీ గంజాయిని పరిచయం చేసిందని ఫైర్ అయ్యారు. గిరిజనుల పొట్టకొట్టే ప్రభుత్వం వైకాపా. నమ్మించి గొంతు కోసిన వ్యక్తి జగన్. గిరిజన ప్రాంతాల్లోని ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని సంకల్పించా. నేను గతంలో ఇచ్చిన జీవో నెంబర్ 3ని ఎందుకు రద్దు చేశారో వైకాపా చెప్పాలన్నారు.

జగన్ పని అయిపోయిందని, జనసేన, టిడిపిలు కలసి ఈ ప్రభుత్వాన్ని సాగనంపు తున్నాయని అన్నారు. తమ భవిష్యత్ కోసం గిరిజనలు టిడిపికి ఓటేసి గెలిపించాలన్నారు. సామాజిక న్యాయం చేస్తానని సీఎం గొప్పలు చెబుతున్నారు. జీవో నెంబర్ 3 రద్దు చేయడం సామాజిక న్యాయమా? మళ్లీ తెదేపా అధికారంలోకి రాగానే దానిని పునరుద్ధరిస్తాం. గిరిజనుల కోసం మేం 16 పథకాలు ప్రత్యేకంగా తీసుకొచ్చాం.

వాటిని ఎందుకు రద్దు చేశారో జగన్ చెప్పాలన్నారు. గిరిజనుల పిల్లలు చదువుకోవడం ఆయనకు ఇష్టం లేదు. అందుకే ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం రద్దు చేశారు. ప్రపంచంలో ఎక్కడ చదివినా గిరిజనులకు స్కాలర్షిప్పులు ఇస్తే.. దాన్నీ తీసేశారు. నైపుణ్యం కోసం శిక్షణ కేంద్రాలు పెడితే వాటినీ ఊడగొట్టారు. గిరిపుత్రిక కల్యాణ పథకాన్నీ రద్దు చేశారు. గిరిజనులకు 50 ఏళ్లకే పింఛన్ ఇచ్చిన ఘనత తెదేపాది.

గిరిజనుల సహజ సంపదను దోచుకునే వ్యక్తి జగన్ అని చంద్రబాబు మండిపడ్డారు. గిరిజన ప్రాంతంలో ఎక్కడైనా రహదారి వేశారా? సకాలంలో వైద్యం అందకపోవడంతో చిట్టంపాడుకు చెందిన గర్భిణి చనిపోయారు. మృతదేహాన్ని ఇంటికి తీసుకుపోవాలంటే అంబులెన్స్ పంపలేదు. స్కూటర్పై ఎక్కించుకొని ఇంటికి తీసుకుపోవాల్సిన పరిస్థితి. ఆయన నొక్కే బటన్ ఒకటి.. బొక్కే బటన్ ఒకటి.

జగన్ దోచేది ఎక్కువ.. జనాలకు ఇచ్చేది తక్కువ. విద్యుత్ ఛార్జీలు ఐదు రెట్లు పెంచేశారని చంద్రబాబు విమర్శించారు. ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి ఒక్క మంచిపని అయినా చేశాడా అని చంద్రబాబు ప్రశ్నించారు. బటన్ నొక్కడం తప్ప గిరిజనులకు చేసిందేమీ లేదని విమర్శించారు. నమ్మించి మోసం చేసే వ్యక్తి జగన్ అని అన్నారు. అడ్డగోలుగా ధరలు పెంచి ప్రజలను దోచుకుంటున్నారని ఆరోపించారు. గిరిజనుల కోసం తాము 16 పథకాలు ప్రత్యేకంగా పెట్టామని.. ఐదేళ్ల పాలనలో 16 గిరిజన పథకాలను రద్దు చేసిన వ్యక్తి జగన్ అని ఫైర్ అయ్యారు చంద్రబాబు.

ఈ 16 పథకాలను ఎందుకు రద్దు చేశారో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు చంద్రబాబు. గిరిజనుల పిల్లలు చదువుకోవడం జగన్కు ఏమాత్రం ఇష్టం లేదని, అందుకే గిరిజనులకు స్కాలర్షిప్లు ఇస్తుంటే దాన్ని కూడా తీసేశారని ఆరోపించారు చంద్రబాబు. నైపుణ్యం కోసం ఏర్పాటు చేసిన శిక్షణాకేంద్రాలను సైతం జగన్ తీసేశారని విమర్శించారు చంద్రబాబు. గిరిపుత్రిక కల్యాణపథకం తీసుకొస్తే.. దాన్నీ రద్దు చేశారన్నారు.

గిరిజనులకు 50 ఏళ్లకే పింఛన్ ఇచ్చిన ఘనత టీడీపీది అని పేర్కొన్నారు. గిరిజనుల సహజ సంపద దోచుకునే వ్యక్తి జగన్ అని విమర్శించారు. పోలవరం ప్రాంతాలన్నింటిని కలిపి కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రకటించారు. పోలవరం జాతీయ పథకమని, ఐదేళ్లలో దానిని పూర్తి చేయలేక పోయారని మండిపడ్డారు. కేంద్రం నిధులు ఇచ్చే పథకాలను పక్కన పెట్టారని అన్నారు.

31, Aug 2024

ఏపీలో భారీ వర్షాలుతో.. ఏడుగురి మృతి

21, Aug 2024

అనకాపల్లి జిల్లాలో.. ఫార్మా యూనిట్‌లోని రియాక్టర్‌ పేలుడు, 14 మంది మృతి

15, Aug 2024

ప్రతి ఇల్లు, కార్యాలయంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ఆంధ్రా సీఎం పిలుపునిచ్చారు

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP