20-01-2024 RJ
ఆంధ్రప్రదేశ్
గుంటూరు, జనవరి 20: అమరావతి దళిత జేఏసీ కన్వీనర్ గడ్డం మార్టిన్ లూథర్బాబు
గుండెపోటుతో మృతి చెందారు. నాలుగు రోజుల క్రితం అస్వస్థతకు గురవడంతో తాడేపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం మృతి చెందినట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.
లూథర్ బాబు మృతి ఉద్యమానికి తీరని లోటని అమరావతి ఐకాస నాయకులు తెలిపారు. అమరావతి ఉద్యమంలో దళితులను ముందుండి నడిపించడంలో ఆయన చేసిన పోరాటం వృథా కాదన్నారు. ఉద్యమం చివరి దశకు వచ్చిన సమయంలో మార్టిన్ ను కోల్పోవడం బాధాకరమన్నారు.