20-01-2024 RJ
సినీ స్క్రీన్
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, టైగర్ ష్రఫ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం 'బడే మియాన్ చోటే మియాన్’ .ఈ సినిమాకు అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తుండగా.. మానుషి చిల్లర్, సోనాక్షి సిన్హా కథనాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్ ఆకట్టుకుంటుంది.
ఇదిలా వుంటే తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ఫస్ట్ లుక్ తో పాటు రిలీజ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాను రంజాన్ కానుకగా ఏప్రిల్ 10న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. దీనితో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది. ఈ పోస్టర్ లో అక్షణ్ కుమార్, టైగర్ ష్రఫ్ గన్స్ పట్టుకోని ఫూల్ యాక్షన్ మోడ్ లో కనిపిస్తున్నారు. ఇక ఈ సినిమా టీజర్ ను రిపబ్లిక్ కానుకగా జనవరి 24న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
అయితే మరోవైపు రంజాన్ కానుకగా టాలీవుడ్ నుంచి మరో పాన్ ఇండియా సినిమా రిలీజ్ కాబోతుంది. టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ నటిస్తున్న దేవర చిత్రం ఏప్రిల్ 5న విడుదల కానుంది. దీంతో ఈ రెండు సినిమాల మధ్య ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.