20-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జనవరి 20: అయోధ్య రాముడికి పోచంపల్లి పట్టువస్త్రాలను సమర్పించడం చాలా సంతోషదాయకమని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం సనత్ నగర్ లోని హనుమాన్ దేవాలయంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో అయోధ్య రాముడికి సమర్పించనున్న పోచంపల్లి పట్టువస్త్రాలను మగ్గంపై తయారీని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శాస్త్రోక్తంగా ప్రారంభించారు.
ముందుగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఎమ్మెల్యే కు స్వాగతం పలికారు. వస్త్రాలను ఈ నెల 29 వ తేదీన అయోధ్యకు తీసుకెళ్ళి సమర్పించనున్నట్లు నిర్వహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కొలను లక్ష్మీ బాల్ రెడ్డి, ఆలయ ఈఓ బాల్ రాజు, బీఆర్ఎస్ నాయకులు కొలను బాల్ రెడ్డి, పి. శేఖర్, పుష్పాలత, పద్మశాలి సంఘం ప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యే ఇరబత్తిని అనిల్ కుమార్, ఎస్ ఎస్ జయరాజ్, బొమ్మెర్ల సతీష్, కేదార్, రాఘవేంద్ర, భువనేశ్వరి, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.