21-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జనవరి 21: రేవంత్ సర్కార్ ఆదివారం నలుగురు సలహాదారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా తెలంగాణ శాసనమండలి మాజీ ప్రతిపక్ష నేత మహ్మద్ అలీ షబ్బీర్ నియమితులయ్యారు. ఆయన నియామకంతో పాటు, ముఖ్యమంత్రి (ప్రజా వ్యవహారాలు) సలహాదారుగా వేం నరేందర్ రెడ్డిని, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా డాక్టర్ మల్లు రవిని నియమించారు. ప్రోటోకాల్, ప్రజా సంబంధాల కోసం ప్రభుత్వ సలహాదారుగా హర్కర వేణుగోపాల్ రావును నియమించారు.