22-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జనవరి 22: హైదరాబాద్ లోని దిల్సుఖ్ నగర్ బస్ డిపోలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. సోమవారం (జనవరి 22) తెల్లవారుజామున.. ఈ అగ్నిప్రమాదంలో రెండు ఆర్టీసీ బస్సులు దగ్ధం కాగా, మరో బస్సు పాక్షికంగా దగ్దమైంది. మంటలను గమనించిన డిపో భద్రతా సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నించి..
వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్ తో మంటలను అదుపు చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఆర్టీసీ రీజినల్ మేనేజర్ వరప్రసాద్ సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.