22-01-2024 RJ
తెలంగాణ
మహబూబాబాద్, జనవరి 22: భూమిలో దాచిపెట్టిన డబ్బులు పోయాయని ఓ వృద్ధురాలు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసింది. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం జగ్గు తండాకు చెందిన తమ్మిశెట్టి రంగమ్మ కిరాణ షాపు నడుపుకుంటు జీవిస్తున్నది. ఈ క్రమంలో తన వద్దనున్న రెండు లక్షలు ఇంట్లో పెడితే దొంగలు తీస్తారనే భయంతో ఇంటి ఆవరణంలో ప్లాస్టిక్ డబ్బాలో డబ్బును ఉంచి పాతి పెట్టింది.
అనంతరం పని నిమిత్తం ఊరికి వెళ్లి వచ్చిన వృద్దురాలు పెట్టిన చోట డబ్బు వెతకగా లేకపోవడంతో నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఎస్ఐ ఉపేందర్ తన సిబ్బందితో కలిసి ఇంటి ఆవరణలో వెతకడంతో భూమిలో పాతిపెట్టి ఉన్న రెండు లక్షల నగదు దొరికాయి. దీంతో స్థానిక ఎంపీటీసీ కుమారి, సర్పంచ్ రమేష్ సమక్షంలో వృద్ధురాలికి అందించారు. అనంతరం డబ్బులు బ్యాంకులో దాచుకోవాలని ఎస్ఐ వృద్ధురాలికి సూచించారు.