23-01-2024 RJ
సినీ స్క్రీన్
'డంకీ’ సక్సెస్ ను ఆస్వాదిస్తున్న తాప్సీ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో 'యానిమల్' చిత్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ ఇండస్ట్రీ ఏదైనా నటీనటులకు ఒక పవర్ ఉంటుంది. దాంతోపాటే కొన్ని బాధ్యతలు కూడా ఉంటాయి. ఇతర నటీనటులను వేలెత్తి చూపించి.. వాళ్లు ఇలాంటివి చేయకుండా ఉండాల్సిందని చెప్పే మనస్తత్వం నాకు లేదు.
ఎందుకంటే, అది వాళ్ల వ్యక్తిగత అభిప్రాయం. మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. నచ్చింది ఎంచుకునే స్వేచ్ఛ సమాజం మనకు ఇచ్చింది. నేను అయితే అలాంటి కథలకు ఓకే చెప్పను' అని తాప్సీ అన్నారు. దేశ సరిహద్దుల ద్వారా అక్రమంగా ప్రయాణించడాన్ని డాంకీ ట్రావెల్ అంటారు.
పంజాబీ వాళ్లు దానిని 'డంకీ' అని పిలుస్తుంటారు, అలా.. భారత్ నుంచి ఎన్నో దేశాలు దాటి యూకేలోకి అక్రమంగా ప్రవేశించే స్నేహితుల చుట్టూ తిరిగే కథతో రూపొందిన చిత్రమిది. రాజ్కుమార్ హిరాణీ దర్శకత్వం వహించారు. షారుక్ ఖాన్, విక్కీ కౌశల్, తాప్సీ కీలక పాత్రలు పోషించారు. కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 21న విడుదలై విజయం సాధించింది.