23-01-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, జనవరి 23: ఎన్నికల సమయం కావడంతో ప్రతిపక్షాలు ఈ అంశంపై రాద్ధాంతం చేయడం ప్రారంభించాయి. అంగన్‌వాడీలు చేస్తున్న సమ్మెతో గత కొద్దికాలంగా నలుగుతున్న విషయం తెలిసిందే.. ఇప్పుడీ సమస్య నుంచి బైటపడటానికి, సోమవారం రాత్రి అంగన్వాడీ యూనియన్ నాయకులతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేర్చించుకొని మంత్రి బొత్స మీడియా సమావేశంలో హామీలు తీరుస్తామని తెలిపారు.
అంగన్‌వాడీలు ప్రభుత్వం ముందు ఉంచిన 11 డిమాండ్లలో 10 నెరవేర్చేందుకు అంగీకరించామన్నారు. జీతాల పెంపును జూన్ నుంచి అమలు చేస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో అంగన్‌వాడీలు అంగీకరించారు. డిమాండ్లను ప్రభుత్వం ఒప్పుకోవడంతో ఇక సమ్మె విరమిస్తున్నట్లు, మంగళవారం నుంచి విధుల్లో హాజరవుతున్నట్లు ఏపీ అంగన్వాడీ ప్రధాన కార్యదర్శి సబ్బరావమ్మ చెప్పారు.
ఈ సందర్భంగా సబ్బరావమ్మ మాట్లాడుతూ.. చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయని, జీతాల పెంపుపై నిర్ధిష్ఠ నిర్ణయం జులైలో చేస్తామని చెప్పారని, మాకు జీతాల పెంపు ఎంత అనేది కూడా రాతపూర్వకంగా ఇస్తామని చెప్పారని సుబ్బరావమ్మ తెలిపారు.