23-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జనవరి 23: రాబోయే లోక్ సభ ఎన్నికలకు ముందు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో అర్హులైన మహిళలకు రూ.500 ధర గల సబ్సిడీ ఎల్ పిజి సిలిండర్లు, నెలకు రూ.2500 ఆర్థిక సహాయం అందించడానికి సిద్ధమవుతోంది. ఇటీవల దావోస్, లండన్, దుబాయ్ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి మహాలక్ష్మి హామీలో భాగమైన ఈ రెండు పథకాల అమలుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది.
ఇటీవల డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు జరిగిన ప్రజా పాలన కార్యక్రమంలో రూ.500 ధర కలిగిన సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ల కోసం మొత్తం 91.49 లక్షల మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా 92.23 లక్షల మంది మహిళలు ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇతర హామీలతో పోలిస్తే సబ్సిడీ గ్యాస్, ఆర్థిక సాయం అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయి.