23-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జనవరి 23: మాదాపూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో సోమవారం రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్‌లో సీజ్ చేసి ఉంచిన సిలిండర్లు పేలడంతో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. స్టేషన్ సమీపంలో బాణసంచా కాల్చడంతో నిప్పురవ్వలు ఎగిసిపడి సిలిండర్ల మీద పడ్డాయి. ఈ క్రమంలోనే పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేసారు. దింతో ఎలాంటి ప్రాణనష్టం గానీ, ఆస్తినష్టం గానీ జరగలేదని అంత ఊపిరిపీల్చుకున్నారు.