23-01-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అనంతపురం, జనవరి 23: దివంగత పరిటాల రవి వర్ధంతి సందర్భంగా ఆయన స్వగ్రామంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 24న పరిటాల రవీంద్ర వర్ధంతి నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. తనయుడు పరిటాల శ్రీరామ్, కుటుంబ సభ్యులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. అభిమానులు స్వచ్ఛందంగా తరలిరానుండడంతో వారికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.
వర్ధంతి రోజు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ.. పరిటాల రవీంద్ర వర్ధంతి రోజును అభిమానులు ఎన్నటికీ మరవరని, అందుకే వారికి ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.