23-01-2024 RJ
ఆంధ్రప్రదేశ్
కడప, జనవరి 23: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించి 2024లో చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చెయ్యడమే లక్ష్యమని జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి చదిపిరాళ్ల భూపేష్ రెడ్డి అన్నారు. పేద మధ్యతరగతి ప్రజలపై, రాష్ట్ర ప్రభుత్వం నిత్యావసర సరుకుల ధరలను పెంచి నడ్డి విరుస్తుందన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
ఉద్యోగస్తులకు సక్రమంగా జీతాలు ఇవ్వకుండా అడ్డుకోవడం ఒకవైపు, మరోవైపు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం వైసీపీ పరాకాష్టకు నిదర్శనం అన్నారు. ఈ కార్యక్రమమును జయప్రదం చేయడం లక్ష్యంగా టిడిపి కార్యకర్తలు పనిచేయాలన్నారు.