23-01-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, జనవరి 23: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు జనసేన అధినేత పవన్ కల్యాణ్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పాదయాత్ర చేపట్టి ప్రజలతో మమేకం కావడంలో లోకేష్ తనదైన పంథాను అనుసరించారన్నారు.
ప్రజా సమస్యలు చూస్తూ, రాజకీయ ఒత్తిళ్లతో సామాన్యులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో స్వయంగా తెలుసుకున్నారన్నారు. లోకేష్ ను భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు, సంతోషాలను అందించాలని కోరుకుంటున్నట్టు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.