ad1
ad1
Card image cap
Tags  

  23-01-2024       RJ

నాకు నా అక్కా చెల్లమ్మలే స్టార్ కాంపెయినర్లు

ఆంధ్రప్రదేశ్

అనంతపురం, జనవరి 23: ఏమంచీ చేయని చంద్రబాబుకు స్టార్ కాంపెయినర్లు ఉన్నారని.. తనకు అలాంటి వారు లేరని, పైన దేవుడు కింద మీరు ఉన్నారని సిఎం జగన్ వ్యాఖ్యానించారు. తను మంచిచేస్తున్నందున లబ్దిపొందుతున్న వారే తన స్టార్ కాంపెయినర్లని అన్నారు. ఉరవకొండలో వైఎస్ఆర్ ఆసరా నిధులకు బటన్ నొక్కే కార్యక్రమంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిలపై కూడా పరోక్ష విమర్శలు చేశారు. ఆమె చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్ గా మారారని విమర్శలు గుప్పించారు. ఏపీలో చంద్రబాబుకు చాలా మంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారన్నారు.

వారిలో బీజేపీలో కొంత మంది ఉన్నారని.. పక్క రాష్ట్రంలో ఉండే దత్తపుత్రుడు కూడా చంద్రబాబు స్టార్ క్యాంపెయినరేన్నారు. రాష్ట్రాన్ని చీల్చిన కాంగ్రెస్ పార్టీలోనూ కొత్తగా కొందరు స్టార్ క్యాంపెయినర్లు చంద్రబాబు కోసం చేరారని ఆరోపించారు. కాంగ్రెస్ లో చేరింది ఆయన సోదరి షర్మిలనే కాబట్టి.. షర్మిలను ఉద్దేశించి చేసినవేనని స్పష్టమవుతోంది. పసుపు కమలాల మనుషులు బాబుకు స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు. ఇంకా స్టార్ క్యాంపెయినర్లు చాలామందే ఉన్నారు. అమరావతిలో బాబు బినామాలు ఉన్నట్లే.. ఇతర పార్టీల్లో చంద్రబాబు బినామాలు స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు. కొందరు టీవీల్లో విశ్లేషకులు, మేధావుల పేరిట టీవీల్లో కూడా కనిపిస్తారని సీఎం జగన్ విమర్శించారు.

చెడు మాత్రమే చేసిన చరిత్ర ఉన్న చంద్రబాబు నాయుడికి గజ దొంగల ముఠా ఉంది. ఆయనకు మంచి చేసిన ఘనతే లేదు. పాలనతో మోసం చేసిన ఘనతే ఉందని విమర్శించారు. ఏం చేయని ఆయనకు ఇంత మంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు. బాబును భుజాన మోసే ముఠా చాలామందే ఉన్నారు. తనకు అలాంటివారు ఎవరూ లేరన్నారు. పొదుపు సంఘాల రుణమాఫీ చేస్తానని మేనిఫెస్టో లో చంద్రబాబు హామీ ఇచ్చారని.. ఎన్నికలయ్యాక మేనిఫెస్టో చెత్త బుట్టలో పడేశాడు.

అక్కాచెల్లెమ్మలకు ఇచ్చిన ఆ మాట గాలి కొదిలేశాడు. అక్టోబర్ 2016 నుంచి ఆ అక్కాచెల్లెమ్మలకు సున్నా వడ్డీ పథకం రద్దు చేశాడు. అప్పట్లో.. పొదుపు సంఘాల రుణాలు కాస్త.. తడిసి మొపెడు అయ్యి వడ్డీలు, చక్రవడ్డీలు కట్టుకునే పరిస్థితికి వచ్చింది. పొదుపు సంఘాల అక్కాచెల్లెమ్మలు, చంద్రబాబు నాయుడిగారి ఒక్క మోసంతో.. దెబ్బ పడింది అనడానికి ఇదే ఉదాహరణ. చంద్రబాబు మోసానికి ఏ గ్రేడ్, బీ గ్రేడ్ సంఘాలు కూడా కిందకు పడిపోయాయన్నారు.

గతంలో జన్మభూమి కమిటీ స్థాయి నుంచి సీఎం స్థాయి దాకా లంచాలిస్తేనే పనులు జరిగేవని.. ఇప్పుడు పాదర్శకంగా సంక్షేమం అర్హులకు అందుతోందని జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. గతంలో కూడా ఓ పాలన ఉండేది. అప్పుడు కూడా ఒకే రాష్ట్రం.. మిగిలినవి మామూలే. అప్పుల గ్రోత్ రేటు కూడా తక్కువే. మీ బిడ్డ ప్రభుత్వంలో అక్కాచెల్లెమ్మల ముఖంలో చిరునవ్వులు కనిపిస్తున్నాయ న్నారు. గతంలో దోచుకో పంచుకో తినుకో ఉండేది. ఇప్పుడు మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు.. నేరుగా మీ ఖాతాల్లోనే డబ్బు జమ అవుతోంది. తేడా గమనించమని కోరుతున్నానన్నారు.

ఏనాడూ మంచి చేయని చరిత్ర ఉన్న చంద్రబాబు కోసం పక్క రాష్ట్రం.. పక్క పార్టీల్లోనూ స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారని.. మంచినే నమ్ముకున్న తనకు అలాంటి వాళ్ల అవసరం తనకు ఏమాత్రం లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఉరవకొండ లో వైఎస్సార్ ఆసరా నిధుల జమ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రతిపక్షాల కూటమి రాజకీయంపై విసుర్లు విసిరారు. ఏమీ చేయని వారికి, చెడు మాత్రమే చేసిన చరిత్ర ఉన్న వారికి, చంద్రబాబుకు, ఆయన ఎల్లో మీడియాకు, ఆయన గజదొంగల ముఠా, ఆయనకు తోడు పత్రికుల, చానళ్లు వీళ్లందరికీ తోడు ఒక దత్తపుత్రుడు.

రోజూ ఇలాంటి వారికి సమాధానం ఇవ్వాల్సి రావడమే నిజంగా కలికాలం అనిపిస్తుంది. ప్రతి ఇంట్లోనూ జరిగిన మంచి కనిపిస్తోంది. అయినా రోజూ అబద్దాలు, ఎక్కువ మంది వాళ్లవైపు ఉన్నారు కాబట్టి, టీవీ చానళ్లు ఉన్నాయి కాబట్టి రోజూ అబద్ధాలతో   వడ్డించడం, దానికి కూడా సమాధానాలు చెప్పుకోవాల్సిన పరిస్థితి అంటే దీన్నే కలికాలం అంటారని విమర్శలు చేశారు. మంచీ చేయకపోయినా, ఏ స్కీములూ ఆయన అమలు చేయకపోయినా కూడా కేవలం మోసాలే ఆయన చేసినప్పటికీ చంద్రబాబు కేమో స్టార్ క్యాంపెయినర్ లు దండిగా ఉన్నారని ఎద్దేవా చేశారు.

బాబు కోసం చంద్రబాబును భుజాని కెత్తుకొని మోసే ముఠా. చాలా మంది ఉన్నారు. మన రాష్ట్రంలో ఎవరూ ఉండరు. వాళ్లు ఇళ్లు, కాపురాలు,నంసారాలు పక్క రాష్ట్రంలో ఉంటాయి. పక్క రాష్ట్రంలో పర్మినెంట్ రెసిడెంట్ గా ఉన్న దత్తపుత్రుడు స్టార్ క్యాంపెయినర్ అయితే, చంద్రబాబు వదినగారు.. ఆమె పక్కపార్టీలోకి వెళ్లి చంద్రబాబుకు మరో స్టార్ క్యాంపెయినర్. ఆయన వదిన అంటే అందరికీ తెలిసే ఉంటుంది. పక్క రాష్ట్రంలో శాశ్వతంగా ఉ౦టున్న ముగ్గురు మీడియా అధిపతులు.

అక్కడున్న ఆ మీడియా అధిపతులు కూడా బాబుకు స్టార్ క్యాంపెయినర్లే. అభివృద్ధి చేయని వారికి, ప్రజలకు ఏ మంచీ చేయని వారికి, ప్రజలకు మోసాలే చేసిన వారికి ఈ రాష్ట్రానికి కూడా అన్యాయం చేసిన వారికి ఇంత మంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు గానీ, ప్రతి పేద ఇంటికి అభివృద్ధి ఫలాలు అందించిన మీ బిడ్డకు, ప్రతి పేద ఇంటికీ మంచి చేసిన మీ బిడ్డకు ఎలాంటి స్టార్ క్యాంపెయినర్లూ లేరు. కానీ మీ బిడ్డ వీళ్లందరినీ నమ్ముకోలేదు. వీళ్లందరికీ ఈ సందర్భంగా చెప్పాలనుకుంటున్నాడు.

వీళ్లందరికన్నా ఎక్కువ స్టార్ క్యాంపెయినర్లు మీ బిడ్డకు ఉన్నారని చెప్పడానికి సంతోషపడుతున్నాడు. మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లు ఎవరో తెలుసా..ఈ జెండాలు జతకట్టిన వారంతా అనుకుంటున్నారు.. మీ బిడ్డకకు స్టార్ క్యాంపెయినర్లు లేరని.. వారికీ నాకూ తేడా ఏమిటో తెలుసా.. కుట్రలు, కుతంత్రాలతో జెండాలు జతకట్టడమే వారి ఎజెండా.. జనంగుండెల్లో గుడి కట్టడమే మీ జగన్ ఎజెండా.. కాబట్టే వారికి భిన్నంగా నాకున్నంత మంది స్టార్ క్యాంపెయినర్లు, దేశ చరిత్రలోనే కాదు.. రాజకీయ చరిత్రలోనే ఎవరూ ఉండరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నానని అన్నారు.

మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లు.. మీరేనని అన్నారు. పైన దేవుడు.. కింద మేరంతా ఉన్నారని అన్నారు. ఆ మంచి జరిగిన ఆ ప్రతి ఇల్లూ.. ఆ ప్రతి ఇంట్లో ఉన్న నా అక్కచెలలెమ్మలందరూ మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే. ఒక వైయస్సార్ ఆనరా అందుకున్న నా అక్కాచెల్లెమ్మలంతా 80 లక్షల మంది అక్కాచెల్లెమ్మలు మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే.

సున్నావడ్డీ అందుకున్న కోటి మందికిపైగా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే, 57 లక్షల మంది తల్లులు, కోటికిపైగా ఉన్న ఆ పిల్లలు వీళ్లంతా కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే. చేయూత అందుకున్న 31 లక్షల మంది నా అక్కాచెల్లెమ్మలు వీరంతా కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే. 31 లక్షల మంది ఇళ్ల పట్టాలందుకున్న నా అక్కచెలలెమ్మలు, వాళ్ల కుటుంబాలు, అందులో 22 లక్షల ఇళ్లు నిర్మిస్తున్న ఈ కుటుంబాలన్నీ కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే.

రైతు భరోసా అందుకుంటున్న అరకోటికిపైగా ఉన్న 52 లక్షల మంది ఆ రైతన్నలందరూ మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే. నెలనెలా పెన్షన్లు అందుకుంటున్న 65 లక్షల మంది నా అవ్వాతాతలు, నా వికలాంగులు, వికలాంగ సోదరులు, అక్కచెల్లెమ్మలు, వితంతు అక్కచె--లలెమ్మలు వీళ్లందరూ మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లేనని అన్నారు.

31, Aug 2024

ఏపీలో భారీ వర్షాలుతో.. ఏడుగురి మృతి

21, Aug 2024

అనకాపల్లి జిల్లాలో.. ఫార్మా యూనిట్‌లోని రియాక్టర్‌ పేలుడు, 14 మంది మృతి

15, Aug 2024

ప్రతి ఇల్లు, కార్యాలయంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ఆంధ్రా సీఎం పిలుపునిచ్చారు

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP