23-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జనవరి 23: హైదరాబాద్ నగరంలో విషాదం చోటుచేసుకుంది. కళ్ల ముందే కన్న కొడుకు గుండెపోటుతో చనిపోయాడు. కుందన్ బాగ్ లో నివాసం ఉండే డీసీపీ వెంకటేశ్వరుర్లు కుమారుడు చంద్రతేజ్(20) గుండెపోటుతో మృతి చెందాడు. సోమవారం రాత్రి చంద్రతేజ్ కు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం చనియినట్లు డాక్టర్లు తెలిపారు. చంద్రతేజ్ ఓ ప్రైవేట్ కాలేజీలో మెకానికల్ ఇంజినీరింగ్ చదువుతున్నాడు. ఎన్నికల సమయంలో డీసీపీ వెంకటేశ్వర్లుపై సస్పెన్షన్ వేటు పడింది. చంద్రతేజ్ మృతదేహాన్ని వారి స్వగ్రామం నల్గొండ జిల్లాకు తరలించారు. చంద్రతేజ్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.