23-01-2024 RJ
తెలంగాణ
చేర్యాల, జనవరి 23: కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి పట్నం వారం సందర్భంగా రూ.70,22,307 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో ఏ.బాలాజీ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఆర్ణీత సేవలు, గదులు, దర్శనాలు, ప్రసాదాల విక్రయం తదితర వాటి ద్వారా శనివారం రూ.11,84,726, ఆదివారం రూ.47,82,420, సోమవారం రూ.10,55,161 ఆదాయం వచ్చిందన్నారు.
గత సంవత్సరం పట్నం వారానికి రూ. 49,83,819 ఆదాయం మల్లికార్జున స్వామి వారి ఖజానాకు సమ కూరినట్లు తెలిపారు. నిరుడితో పోల్చితే ఈసారి రూ.20,38,488 అదనంగా ఆదాయం వచ్చిందన్నారు. ఉత్సవాల సందర్భంగా స్వామి వారి ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.