23-01-2024 RJ
సినీ స్క్రీన్
ప్రముఖ నటి లావణ్య త్రిపాఠీ, బిగ్ బాస్ ఫేమ్ అభిజీత్ దుద్దాల, అభిజ్ఞ ఉతలూరు కీలక పాత్రల్లో పోషించిన 'మిస్ పర్ఫెక్ట్' వెబ్ సిరీస్ ను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. విశ్వక్ ఖండేరావ్ దర్శకుడు. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో 'మిస్ పర్ఫెక్ట్' స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ని నిన్న విడుదల చేశారు.
ఈ వెబ్ సిరీస్ లో అభిజీత్ మెయిన్ రోల్ చేస్తున్నారని అన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీలయ్యాను అని చెప్పాడు దర్శకుడు విశ్వక్. 'నేను బిగ్ బాస్ చూడలేదు, కానీ అభిజీత్ చేసిన 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్', మరికొన్ని ప్రాజెక్ట్స్ చూశాను. తను ఆడిషన్ ఇవ్వాల్సిన అవసరం లేకున్నా.. ఈ సిరీస్ కోసం ఆడిషన్ ఇచ్చాడు'. అని చెప్పాడు దర్శకుడు.
ఇందులో లావణ్య లీడ్ రోల్ చేస్తున్నారు అనగానే ఆమె చేసిన అందాల రాక్షసి' లో ఆమె పర్ ఫార్మెన్స్ ఎలా ఉందో అలాంటి పర్ ఫార్మెన్స్ ఈ వెబ్ సిరీస్ లో కూడా తీసుకురావాలని అనుకున్నాను. కొత్త టాలెంట్ ను ప్రోత్సహించడం అంటే నాగార్జునకి చాలా ఇష్టం. న్యూ టాలెంట్ ను వెలుగులోకి తీసుకురావడమే ఈ సంస్థ ఉద్దేశం. ఇప్పుడు ఈ 'మిస్ పర్ఫెక్ట్' వెబ్ సిరీస్ తో మేము అదే ప్రయత్నం చేశాం, అని చెప్పారు నిర్మాత యార్లగడ్డ సుప్రియ. ఈ జర్నీలో హాట్ స్టార్ చాలా సపోర్ట్ చేసింది.
ఈ సిరీస్ కోసం చాలా మంది అమ్మాయిలు నో చెప్పిన క్యారెక్టర్ చేస్తానంటూ ముందుకు వచ్చి తన గట్స్ ఎంటో ప్రూవ్ చేసింది అభిజ్ఞ. 'సోగ్గాడే చిన్ని నాయన' టైమ్ నుంచి లావణ్యతో నాకు మంచి స్నేహం ఉంది. మిస్ పర్ఫెక్ట్ కు తనే పర్ఫెక్ట్ అనిపించింది. ఒక చిన్న కథలో బలమైన క్యారెక్టర్స్ ఉండి మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. ఫిబ్రవరి 2న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో చూడండి, అని చెప్పారు సుప్రియ.
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం రోజున మా సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేసుకోవడం హ్యాపీగా ఉంది అని చెప్పారు ఈ వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్ర పోషిస్తున్న లావణ్య త్రిపాఠి. 'ఈ సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు నేను మిస్ పర్ఫెక్ట్. సిరీస్ కంప్లీట్ అయ్యేలోపు మిసెస్ పర్ఫెక్ట్ అయ్యాను. ఈ సిరీస్ కు ముందు నేను చేసిన కొన్ని ప్రాజెక్ట్స్ కు స్టెస్ ఫీలయ్యాను. అలాంటి టైమ్ లో 'మిస్ పర్ఫెక్ట్' లాంటి ఒక స్క్రిప్ట్ దొరకడం రిలీఫ్ లా ఫీలయ్యాను.
పాజిటివ్ ఫీలింగ్ కలుగుతోంది. అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ట అభిజీత్ ముహూర్తంలో చేశారు. నా లైఫ్ లో ఇది మర్చిపోలేని సందర్భం అనుకుంటా, అని చెప్పాడు ఈ వెబ్ సిరీస్ లో లీడ్ యాక్టర్ గా వేసిన అభిజీత్. 'అన్నపూర్ణ సంస్థలో పనిచేయడం ఎప్పుడూ హ్యాపీగా ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ స్క్రిప్ట్ బాగా నచ్చింది, లావణ్య గారితో కలిసి నటించడం సంతోషంగా ఉంది, అని చెప్పాడు అభిజిత్.