23-01-2024 RJ
సినీ స్క్రీన్
సూపర్ స్టార్ మహేశ్ బాబు, అగ్ర దర్శకుడు రాజమౌళి కలయికలో 'ఎస్ఎస్ఎంబీ29' రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని సినీ ప్రియులు ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ చిత్ర రచయిత వి. విజయేంద్ర ప్రసాద్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా గురించి అప్డేట్ ఇచ్చారు. ఆ చిత్రం 'ఇండియానా జోన్స్'లా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు.
ప్రస్తుతానికి ఈ సినిమాకి టైటిల్ ఖరారు కాలేదు. కథ ఎక్కువగా అడవి నేపథ్యంలో సాగుతుంది. పీరియాడికల్ కథ కాదు. స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయి. మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయని తెలిపారు. 'ఈ సినిమాతో మహేశ్ బాబు ఇమేజ్ మరింత పెరిగే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు 'ఏ సినిమాలో అయినా ప్రధాన పాత్ర పోషించే నటులకు మంచి గుర్తింపురావాలని మా వంతు ప్రయత్నం చేస్తాం' అని విజయేందప్రసాద్ పేర్కొన్నారు.
అంతే కాదు బాలీవుడ్ 'బజరంగి భాయిజాన్' సీక్వెల్ కథ పూర్తయిందని, సల్మాన్ ఖానక్కు వినిపించానని చెప్పారు. చిత్రీకరణ ఎప్పుడు ప్రారంభమవుతుందనేది చూడాలన్నారు. తన డ్రీమ్ ప్రాజెక్టు అయిన 'సీత'ను హాలీవుడ్ స్థాయిలో రూపొందిస్తామని, ఆ పాత్రకు సరిపడ కొత్త నటి కోసం అన్వేషిస్తున్నామని చెప్పారు.