24-01-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, జనవరి 24: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి తరఫున టికెట్ దక్కదని అనుకుంటున్న అభ్యర్థుల ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. అధికార వైసీపీ అసంతృప్త నేతలు టీడీపీ, జనసేన వైపు చూస్తున్నాయి. కొత్తగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నవారు తమకు నచ్చిన పార్టీల్లో చేరుతున్నారు. పార్టీ అధినేతలతో సమావేశమై సీటు ఖరారు చేసుకుంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలను వైఎస్ఆర్ సీపీ పార్టీ భారీగా మారుస్తోంది.
టికెట్ రానీ వారు ఇతర పార్టీల్లోకి వెళుతున్నారు. ఆ జాబితాలో సీనియర్ నేత, గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ చేరారు. గూడూరు వైసీపీ టికెట్ ను మేరీగ మురళికి కేటాయించారు. దాంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం నాడు వరప్రసాద్ భేటీ అయ్యారు. పార్టీలో చేరే అంశంపై చర్చించారు. తిరుపతి నుంచి లోక్ సభకు పోటీ చేయాలని వరప్రసాద్ భావిస్తున్నారు. పవన్ కల్యాణ్ కొణతాల రామకృష్ణ సమావేశం అయ్యారు.
జనసేనలో చేరాలని కొణతాల నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అనకాపల్లి లోక్ సభ స్థానానికి జనసేన పార్టీ నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. నేతల చేరికతో సెగ్మెంట్ల వారీగా పవన్ కల్యాణ్ సమీక్ష చేస్తున్నారు. 35 సెగ్మెంట్లకు సంబంధించిన సమీక్ష చేశారు. ప్రధానంగా ఉభయ గోదావరి, ఉత్తరాంధ్రలోని సీట్ల ఖరారు చేయాలని పవన్ కల్యాణ్ దృష్టిసారించారు.
వచ్చే ఎన్నికల్లో ప్రచారంపై పవన్ కల్యాణ్ నటుడు పృథ్వీ, జానీ మాస్టర్ తో చర్చించారు. తాజాగా ప్రముఖ సినీ నృత్య దర్శకుడు షేక్ జానీ మాస్టర్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. బుధవారం మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన చేరారు. పార్టీ కండువాను కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.