ad1
ad1
Card image cap
Tags  

  25-01-2024       RJ

సర్వీస్ కమిషన్ ఛైర్మన్ తో.. మరో ఐదుగురు సభ్యులు వీరే

తెలంగాణ

హైదరాబాద్, జనవరి 25: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ గా మాజీ డీజీపీ ఎం. మహేందర్ రెడ్డితో పాటు మరో అయిదుగురు సభ్యులు నియమితులయ్యారు. ఈ మేరకు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆమోద ముద్ర వేశారు. ఆయనతో పాటు టీఎస్పీఎస్సీ సభ్యులుగా ఐఏఎస్ అధికారి అనిత రాజేంద్ర, పాల్వాయి రజిని కుమారి, అమీర్ ఉల్లా ఖాన్, యాదయ్య, వై. రామ్మోహన్ రావులను నియమించారు.

సభ్యుల నియామకాలు భర్తీ చేసేందుకు ప్రభుత్వం అర్హత గల వారి నుంచి దరఖాస్తులు స్వీకరించింది. వీటిని పరిశీలించిన సర్కార్.. మహేందర్ రెడ్డి పేరును ఖరారు చేసింది. సభ్యుల నియాకం కూడా పూర్తి కావడంతో త్వరలోనే కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వచ్చే అవాకశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మహేందర్ రెడ్డితోపాటు సభ్యులుగా అనితా రాజేంద్ర (రిటైర్డ్ ఐఏఎస్), పాల్వాయి రజిని కుమారి, అమీర్ ఉల్లా ఖాన్, యాదయ్య, వై రామ్మోహన్ రావులను నియమించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం టీఎస్పీఎస్సీ ప్రతిష్టను దెబ్బ తీసింది. దీనిపై సిట్ విచారణ సైతం జరిగింది. గ్రూప్ 1 పరీక్ష మూడుసార్లు రద్దు కావడంతో నిరుద్యోగులకు కమిషన్ మీద నమ్మకం పోయింది.

మొత్తం 20 పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు లీక్ కావడంతో వాటన్నింటినీ రద్దు చేసింది. హైకోర్టులో కేసు నడిచింది. ఇందుకు బాధ్యులైన వారు జైలు పాలయ్యారు. పలువురు నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రభుత్వం మారిన వెంటనే అప్పటి చైర్మన్ జనార్దన్ రెడ్డి, సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సీఎం రేవంత్ రెడ్డి పరీక్షలను పారదర్శకంగా, కట్టుదిట్టంగా నిర్వహించాలని భావించారు.

కమిషన్ చైర్మన్ బాధ్యతలను విశ్రాంత ఐపీఎస్ కు అప్పగించాలని నిర్ణయించారు. ఇందుకోసం చైర్మన్, సభ్యుల నియామకాలకు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. చైర్మన్ పదవి కోసం సుమారు 50 మంది దరఖాస్తు చేసుకున్నారు. చివరికి మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని ప్రభుత్వం ఖరారు చేసి గవర్నర్ కు పంపింది. ఇవాళ గవర్నర్ తమిళిసై ఆమోద ముద్ర వేసింది.

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కిష్టాపురం గ్రామంలోని ఓ మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో 1962 డిసెంబర్ 3న జన్మించిన మహేందర్ రెడ్డి 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. కిష్టాపురంలోని ఏకోపాధ్యాయ పాఠశాలలోనే ఆయన బాల్య విద్య సాగింది. రామగుండం ఏఎస్పీగా, నిజామాబాద్, కర్నూలు ఎస్పీగా పనిచేశారు. ఐదేళ్లపాటు ఎన్పీఏలో బాధ్యతలు నిర్వర్తించారు. చంద్రబాబు హయాంలో ఏర్పాటైన సైబరాబాద్ కమిషనరేటు మొదటి కమిషనర్ గా విధులు నిర్వహించి అనేక సంస్కరణకు శ్రీకారం చుట్టారు.

ఆ తర్వాత గ్రేహౌండ్స్, పోలీసు కంప్యూటర్స్ విభాగాల్లోనూ పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక హైదరాబాద్ కమిషనర్ గా నియమితులయ్యారు. స్నేహపూర్వక పోలీసింగ్ పేరుతో అనేక ప్రయోగాలు చేయడంతో పాటు పోలీస్ స్టేషన్లను ఆధునికీకరించడంలో తనదైన భూమిక పోషించారు. 2017 నవంబర్లో తెలంగాణ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన మహేందర్ రెడ్డి 2022 డిసెంబర్ వరకు ఆ పదవిలో కొనసాగారు.

08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

03, Sep 2024

బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుంది: సీఎం రేవంత్

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP