25-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జనవరి 25: టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ సినిమాకు దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సూపర్ హీరో సినిమాలో యంగ్ హీరో తేజ సజ్జ తన నటనతో అందరినీ మెస్మరైజ్ చేశాడు. తాజాగా తెలంగాణ గవర్నర్ తమిళసై హనుమాన్ చిత్ర బృందాన్ని అభినందించారు. 'దేశవ్యాప్తంగా అద్భుతమైన విజయం సాధించినందుకు హనుమాన్ టీమ్ కి అభినందనలు..! మీ విజయం ఎందరికో ఆదర్శమని ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
ఆకట్టుకునే లౌలీ విజువల్స్ లో మరొక కొత్త ప్రపంచాన్ని సృష్టించిన ప్రశాంత్ వర్మకి.. తన అసాధారణ నటనతో హనుమంతు పాత్రలో నటించిన తేజ సజ్జాకు అభినందనలు తెలిపారు. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ స్పందిస్తూ..'మీరు ఇచ్చిన ప్రోత్సాహానికి ధన్యవాదాలు మేడమ్. మా హనుమాన్ టీమ్ మొత్తం మీ ప్రశంసలతో ఉప్పొంగిపోయింది.. అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. రీసెంట్?గా హనుమాన్ మేకర్స్ ని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆధిత్యనాధ్ అభినందించిన విషయం తెలిసిందే.
దేవుళ్లను సూపర్ హీరోలుగా ప్రపంచానికి పరిచయం చేస్తున్న ప్రశాంత్ వర్మ జై హనుమాన్ సీక్వెల్ స్క్రిప్ట్ కూడా సిద్ధమవుతుందని తెలిపాడు. అయితే జై హనుమాన్ స్టోరీ ఆంజనేయుడి పాత్ర చుట్టూనే ఉండటంతో.. బలమైన హీరో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. హనుమాన్ సినిమా రిలీజైన మొదటి ఆట నుండే హిట్ టాక్ తెచ్చుకుని బాక్సాపీస్ వసూళ్లతో దూసుకెళ్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. ఇప్పటి వరకు రూ. 231 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి హనుమాన్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.