25-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జనవరి 25: జనవరి 26వ తేదీ.. రిపబ్లిక్ డే.. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపులు, బార్లు మూసివేయనున్నారు. వైన్ షాపు బంద్ అనే బోర్డులు మద్యం షాపుల ఎదుట దర్శనం ఇవ్వటంతో.. జనవరి 25వ తేదీ గురువారం సాయంత్రం నుంచి హైదరాబాద్ సిటీలో వైన్ షాపుల దగ్గర రద్దీ నెలకొంది. పబ్లిక్ హాలిడే.. దీనికితోడు లాంగ్ వీకెండ్ వచ్చింది.. దీంతో మద్యం ప్రియులు పెద్ద సంఖ్యలో వైన్ షాపుల బాట పట్టారు. ముందుగానే కావాల్సిన కిక్కును కొనుగోలు చేసుకుంటున్నారు.
జనవరి 26వ తేదీ నేషనల్ డ్రై డే.. అంటే దేశవ్యాప్తంగా ఎక్కడా వైన్ షాపులు ఉండవు.. బార్లు తెరవరు.. పబ్స్ ఓపెన్ చేయరు.. శుక్రవారం మందు కొనుగోలు చేయాలంటే అసాధ్యం.. అందుకే ముందుగానే మందును స్టోర్ చేసుకుంటున్నారు మందు ప్రియులు. జనవరి 26 వ తేదీ రిపబ్లిక్ డే సందర్భంగా మద్యం దుకాణాలు బంద్ చేయాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ తెలిపింది.
దేశ వ్యాప్తంగా జనవరి 26 నేషనల్ డ్రైడే గా పరిగణిస్తారు. తెలంగాణలో అన్ని మద్యం దుకాణాలు, బార్లు మూసివేయాలని ఎక్సనున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపింది. తిరిగి శనివారం వైన్ షాపులు తెరుచుకోనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను ఇచ్చింది. నిబంధనలు ఎట్టి పరిస్థితుల్లో ఉల్లంఘించవద్దని? అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది.