26-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జనవరి 26: యాభై రోజుల కాంగ్రెస్ పాలనపై మహిళలకు విశ్వాసం పెరిగిందని సినీ నటి దివ్యవాణి పేర్కొన్నారు. గాంధీభవన్ లో ఆమె మీడియాతో మాట్లాడుతూ... ఉచిత బస్సు ప్రయాణం వల్ల పదికోట్ల మంది మహిళలు ప్రయోజనం పొందారని అన్నారు. ప్రగతి భవన్ ను ప్రజా భవన్ మార్చివేశారన్నారు. రాజకీయ విలువలు పెంచేలా కేసీఆర్ అనారోగ్యంతో ఉన్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి పరామర్శించారని దివ్యవాణి పేర్కొన్నారు.
ఏపీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల నియామకంపై దివ్యవాణి స్పందించారు. షర్మిల నిమాయకం శుభసూచికమన్నారు. నియంత పాలన అంతం కోసం వచ్చిన మహిళ షర్మిల అని కొనియాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో నూతన ఉత్సాహంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం జరుగుతోందని దివ్యవాణి పేర్కొన్నారు.