ad1
ad1
Card image cap
Tags  

  26-01-2024       RJ

ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో జెండా ఆవిష్కరణ

ఆంధ్రప్రదేశ్

అమరావతి, జనవరి 26: 75వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం జెండా ఆవిష్కరించారు. ముందుగా జాతిపిత మహాత్మాగాంధీ చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. పిదప మువ్వన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశమంతా 75వ గణతంత్ర దినోత్సవాలను జరుపుకుంటున్నశుభ దినాన ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.

రాజ్యాంగ స్పూర్తికి అనుగుణంగా రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతకి ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి పధకాలను చిత్తశుద్ధితో అమలు చేస్తోందని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో అసెంబ్లీ సెక్రటరీ జనరల్ డా.పిపిపికె. రామాచార్యులు, ఉప కార్యదర్శులు సుబ్బరాజు, విజయరాజు, చీఫ్ మార్షల్ డి.ఏడుకొండల రెడ్డి,లీగల్ అడ్వయిజర్ ఎం.చంద్రశేఖర్, పలువురు అసెంబ్లీ అధికారులు, ఉద్యోగులు, ఎస్పిఎఫ్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పాలనసాగుతోందని కౌన్సిల్ చైర్మన్ మోషేన్ రాజు అన్నారు.

గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని శుక్రవారం రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ముందుగా జాతిపిత మహాత్మాగాంధీ చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి మువ్వన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం 75వ గణతంత్ర దినోత్సవ వేడుకులను జరుపుకుంటున్న తరుణంలో రాష్ట్ర ప్రజలందరికీ హార్ధిక శుభాకాంక్షలు తెలియజేశారు.

సుమారు 300 ఏళ్ళ పాటు బ్రిటిష్ వలస పానలకు చరమ గీతం పలికి సర్వసత్తా కలిగిన ప్రజాస్వామ్య దేశంగా ప్రకటించబడిన శుభదినం నేడని అన్నారు.నేడు పరిపాలన ఇంత సాఫీగా సాగుతోందంటే అందుకు మన రాజ్యాంగం దాని స్ఫూర్తే కారణమని పేర్కొన్నారు.ముఖ్యంగా మన రాష్ట్రంలో రాజ్యాంగ స్పూర్తికి అనుగుణంగా అన్నివర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించే దిశలో పాలన సాగడం చాలా ఆనందంగా ఉందని చైర్మన్ మోషేన్ రాజు అన్నారు.

భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిగిన మన దేశంలో అన్ని వర్గాల వారికి సమాన అవకాశాలను కల్పించి పాలన సాగించడం ప్రజాస్వామ్య స్పూర్తికి ఇదే ప్రత్యక్ష నిదర్శనం అన్నారు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు పలు సంక్షేమ పధకాలు అమలుతో పాటు విద్యా, వైద్య పరమైన సౌకర్యాలు పూర్తి స్థాయిలో అందించడం నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనమన్నారు.

75వ గణతంత్ర దినోత్సవ వేళ విజయవాడలో రాజ్యాంగ నిర్మాత డా.బిఆర్ అంబేద్కర్ వారి 206 అడుగుల ఎత్తుతో కూడిన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి శాసన మండలి అధ్యక్షులు మోషేన్ రాజు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో అసెంబ్లీ సెక్రటరీ జనరల్ డా. పిపిపికె. రామాచార్యులు, ఉప కార్యదర్శులు విజయరాజు, సుబ్బరాజు,చీఫ్ మార్షల్ ఎ. మురళి, లీగల్ అడ్వయిజర్ ఎం. చంద్రశేఖర్,ఇతర అధికారులు ఉద్యోగులు, ఎస్పిఎఫ్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

31, Aug 2024

ఏపీలో భారీ వర్షాలుతో.. ఏడుగురి మృతి

21, Aug 2024

అనకాపల్లి జిల్లాలో.. ఫార్మా యూనిట్‌లోని రియాక్టర్‌ పేలుడు, 14 మంది మృతి

15, Aug 2024

ప్రతి ఇల్లు, కార్యాలయంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ఆంధ్రా సీఎం పిలుపునిచ్చారు

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP