26-01-2024 RJ
తెలంగాణ
న్యూఢిల్లీ, జనవరి 26: దేశ వ్యాప్తంగా 75వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సైనికుల కవాతు, శకటాల ప్రదర్శన జరిగాయి. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయాలు, అభివృద్ధి తదితర అంశాలను చూపిస్తూ శకటాల ప్రదర్శన జరిగింది. తెలంగాణకు చెందిన శకటం విశేషంగా ఆకట్టుకుంది. తెలంగాణ పోరాట యోధుల థీమ్ తో దీన్ని రూపొందించారు. పల్లెటూరు వాతావరణాన్ని ప్రతిబింబించేలా డిజైన్ ఉంది.