26-01-2024 RJ
తెలంగాణ
నిజామాబాద్, జనవరి 26: జిల్లా వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఊరూవాడా మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. జిల్లా కేంద్రంలోని పెరేడ్ గ్రామంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జాతీయ జెండాను ఆవిష్కరించారు. బీజేపీ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి జెండాను ఎగరవేశారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మేయర్ దండు నీతూ కిరణ్ జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. నగరంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ మంద మకరందం జాతీయ జెండాను ఆవిష్కరించారు.