26-01-2024 RJ
సినీ స్క్రీన్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన తాజా చిత్రం 'గుంటూరు కారం' సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మొదటిరోజే ఈ సినిమాకు కొంచెం మిక్స్డ్ టాక్ రావడంలో కలెక్షన్ల మీద ప్రభావం పడుతుందని ట్రేడ్ వర్గాలు భావించాయి. కానీ ఆ అంచనాలను తలకిందులు చేస్తూ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుని పోతుంది. అయితే ఈ సినిమాలోని సాంగ్స్ ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి ధమ్ మసాలా, కుర్చీ మడత పెట్టి, ఓహ్ మై బేబీ, సాంగ్ లు విడుదల చేయగా.. చార్ట్ బస్టర్లుగా నిలిచాయి. ఇదిలావుంటే.. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ 'అమ్మ' అనే ఎమోషనల్ సాంగ్ను విడుదల చేశారు. పసి వాడయై వేచి చూస్తుందా బదులే రాని గతం. పగ వాడయై నింద మోస్తుందా ఎదుటే ఉన్న నిజం అంటూ సాగిన ఈ పాట హృదయాలను హత్తుకునేలా ఉంది. ఇక ఈ పాటకు 'సరస్వతీ పుత్ర' రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా.. విశాల్ మిశ్రా పాడాడు. థమన్ సంగీతం అందించాడు.