27-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జనవరి 27: పాతబస్తీ చదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం ఘోరా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కాచిగూడకు చెందిన రౌడీ షీటర్ శ్రీకాంత్ సింగ్ మృతి చెందాడు. సవేరా హోటల్ సమీపంలో ద్విచక్రవాహనంపై అతివేగంగా వచ్చి లారీని ఢీ కొట్టి.. లారీ చక్రాల కింద పడి శ్రీకాంత్ సింగ్ మృతి చెందాడు. సమాచారం అందుకుని సంఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వివరాల్లోకి వెళితే.. కాచిగూడ నివాసి శ్రీకాంత్ సింగ్ స్థానిక కాచిగూడ రౌడీ షీటర్.. ఇతనిపై సుల్తాన్ బజార్, లేక్ పోలీస్ స్టేషన్, చైతన్యపురి పీఎస్లలో కేసులు ఉన్నాయి. శ్రీకాంత్ ఒళ్ళంతా పచ్చ బొట్లు వేయించుకున్నాడు. ఇతనికి సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్ లో మంచి ఫాలోవర్స్ ఉన్నారు.. రోడ్లపై బైక్ స్టంట్స్ చేస్తూ ఫాలోవర్స్ పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఈరోజు లారీ చక్రాల కింద పడి చనిపోయాడు. మృతుని వద్ద నుంచి ఒక సెల్ ఫోన్, కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకొని.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.