27-01-2024 RJ
ఆంధ్రప్రదేశ్
ఒంగోలు, జనవరి 27: యువత కోసమే రాజేశేఖర రెడ్డి బిడ్డ ఏపీ రాజకీయాల్లోకి వచ్చిందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీకి తొత్తులుగా మారాయన్నారు. తనకు ఏపీ పుట్టినిల్లు అయితే... తెలంగాణ మెట్టినిల్లు అని పేర్కొన్నారు. ప్రజలకి న్యాయం జరగాలనే ఏపీ రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. వైసీపీకి తన రక్తం ధారపోశానని షర్మిల తెలిపారు.
ఇప్పుడు వైసీపీ తనపై ముప్పేట దాడి చేస్తోందన్నారు. వైసీపీ కోసం తన కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశానన్నారు. వైసీపీని తన భుజస్కంధాలపై మోశానని తెలిపారు. వైఎస్ఆర్ బిడ్డ ఎవరికీ భయపడదన్నారు.నేను యుద్ధానికి రెడీ... మీరు రెడీనా..? వైఎస్ఆర్ పార్టీలో.. వై అంటే వైవీ సుబ్బారెడ్డి.. ఎస్ అంటే సాయిరెడ్డి.. ఆర్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి. వైఎస్ఆర్ పాలనకి.. జగన్ పాలనకీ.. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని అన్నారు.
ఒక్క సంవత్సరమైనా జాబ్ క్యాలెండర్ వచ్చిందా..? ఎన్నికల సమయంలో జాబ్ నోటిఫికేషన్ ఇస్తున్నారు. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పిన జగన్ ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు? 70 వేల విలువైన గంగవరం పోర్టు 600 కోట్లకి అమ్మేశాడు. మళ్ళీ ప్రభుత్వం చేతికి గంగవరం పోర్టు రాదు. ఒక్కొక్క కాంగ్రెస్ కార్యకర్త... ఒక్కొక్క సైన్యంగా మారాలి. ఒక ఎంపీ.. ఒక ఎమ్మెల్యే కూడా లేకుండా ఏపీ బీజేపీ వశం అయిపోయింది.
జగనన్న బీజేపీ కి బానిసగా మారాడు. ఏపీని కూడా బీజేపీకి బానిసగా మారుస్తున్నాడు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అన్నారు. కాంగ్రెస్ అధికారం లోకి వస్తే రాహుల్ గాంధీ మొదటి సంతకం ఏపీకి ప్రత్యేక హోదా పైనే అని షర్మిల పేర్కొన్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టును ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శనివారం ఉదయం పరిశీలించారు.
ఈ సందర్భంగా ప్రాజెక్ట్ కు సంబంధించి వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంపట్ల షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్ఆర్ రూ.750 కోట్లు ఖర్చు పెట్టి గుండ్లకమ్మ ప్రాజెక్టు కడితే మెయింటెనెన్స్ కోసం సంవత్సరానికి కోటి రూపాయలు కూడా వైసీపీ ప్రభుత్వం ఇవ్వలేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జలయజ్ఞంలో భాగంగా వైఎస్ఆర్ గుండ్లకమ్మ ప్రాజెక్టు నిర్మించారన్నారు. లక్ష ఎకరాలకు సాగు నీటితో పాటు 12 మండలాలకు తాగు నీరు ఇచ్చే ప్రాజెక్టు గుండ్లకమ్మ అని అన్నారు.
16 నెలల క్రితం ఒక గేటు, మూడు నెలల క్రితం మరో గేటు కొట్టుకుపోయిందని.. మెయింటెనెన్స్ లేక ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయాయన్నారు. ఐదు సంవత్సరాల నుండి ప్రాజెక్టు మెయింటెనెన్స్ చేస్తే గేట్లు కొట్టుపోయేవి కాదని చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్ రూ.750 కోట్లు ఖర్చు పెట్టి గుండ్లకమ్మ ప్రాజెక్టు కడితే మెయింటెనెన్స్ కోసం సంవత్సరానికి కోటి రూపాయలు కూడా వైసీపీ ప్రభుత్వం ఇవ్వలేదని విమర్శించారు.
ప్రాజెక్టు మెయింటెనెన్స్ చెయ్యని తమరు.. వైఎస్ఆర్ వారసులు ఎలా అవుతారు జగనన్న అని ప్రశ్నించారు. ఇరిగేషన్ శాఖ మంత్రి సంక్రాంతి డ్యాన్సులు చేశారు తప్ప... ప్రాజెక్టు గురించి పట్టించుకోలేదన్నారు. ఈపాపం వైసీపీ నాయకులది కాదా అని నిలదీశారు. కొట్టుకుపోయిన గేటు పైకి తేలుతూ కనిపిస్తుందంటే వైసీపీ నాయకులు సిగ్గుపడాలన్నారు. వెలుగొండ ప్రాజెక్టుకి తట్ట మట్టి కూడా వైసీపీ వెయ్యలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలో వస్తేనే ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ వస్తాయని షర్మిల పేర్కొన్నారు.
వరద ప్రవాహానికి ఏడాది క్రితం ప్రాజెక్టు 6వ నంబర్ గేటు కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. అయితే ఏడాది గడిచినప్పటికీ గేటు ఏర్పాటు చేయడంలో జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. తాజాగా రెండు నెలలు క్రితం మూడో నెంబర్ గేట్ సైతం కొట్టుకు పోయింది. రెండు టీఎంసీల నీళ్లు వృధాగా సముద్రంలోకి వెళ్లాయి. గుండ్లకమ్మ ప్రాజెక్టు ఖాళీ కావడంతో నీళ్ళు లేక ఆయకట్టు రైతులు, ప్రజలు. ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్టుకి కొత్త గేట్లు ఏర్పాటు చేయటంలో జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ తీరుని నిరసిస్తూ వైఎస్ షర్మిల ప్రాజెక్టును సందర్శించారు.
గత10 ఏళ్లలో టిడిపి అధినేత చంద్రబాబు, ముఖ్యమంత్రి జగన్ లు రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. ప్రాజెక్టు గేట్లు కొట్టుకు పోతుంటే సంబంధిత శాఖ మంత్రి మాత్రం సంక్రాంతి డ్యాన్సులు చేస్తున్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ. 750 కోట్లతో గుండ్లకమ్మ ప్రాజెక్టును వైఎస్ఆర్ కట్టించి.. లక్ష ఎకరాలకు సాగునీరు అందించారని అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 12 మండలాల ప్రజలకు, ఒంగోల్ పట్టణానికి త్రాగునీరు అందుతుందన్నారు. అలాంటి ప్రాజెక్టును పూర్తిగా నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని -ర్ అయ్యారు.
నిర్వహణ విషయంలో గత ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. నిర్వహణ లేకనే గేట్లు కొట్టుకుపోయాయి అధికారులు చెప్పారని.. మరమత్తులు చేయాల్సింది పోయి ప్రాజెక్టు నిర్వహణలో లోపాల చెబుతున్నారని సీరియస్ అయ్యారు. అప్పుడు.. టీడీపీ జలయజ్ఞం దోపిడీ అని అర్థంలేని ఆరోపణలు చేసిందన్నారు. ఇళ్లు కట్టుకున్నా.. దానికి నిర్వహణ అవసరమని.. పట్టించుకోకుండా ఉంటే ఏదైనా తుప్పు పడుతుందన్నారు. ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం గేట్లు కొట్టుకు పోతుంటే డ్యాన్సులు చేస్తుందని విమర్శించారు షర్మిల. సంబంధిత మంత్రి సంక్రాంతి డ్యాన్సులు చేస్తారు తప్పా.. పని చేయరన్నారు.
జగన్ ఆన్నకు మరమత్తులు చేయించడానికి మనసు రావడం లేదట.. ఇదేనా వైఎస్సార్ ఆశయాలను నిలబెట్టడం అంటే అని ప్రశ్నించారు. వైఎస్సార్ కట్టిన ప్రాజెక్టును పట్టించుకోని మీరు.. ఎలా వైఎస్సార్ వారసులు అవుతారన్నారు. ఇప్పటికైనా కళ్లు తెరవండి.. లేకుంటే ప్రాజెక్టు మొత్తం కూలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రూ.10 కోట్లు ఇస్తే ఇస్తే ప్రాజెక్టు నిలబడుతుందన్నారు. ప్రాజెక్టు కింద వేసిన పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందన్నారు.
వెలిగొండ ప్రాజెక్టును సైతం నిర్లక్ష్యం చేశారని అన్నారు. 40 టిఎంసిల సామర్థ్యం కలిగిన అతిపెద్ద ప్రాజెక్టు వెలిగొండ.. 4.50 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చే ప్రాజెక్టు సైతం పక్కన పడిందన్నారు. గత 10 ఏళ్లలో చంద్రబాబు, జగన్ ఆన్న ట్టేటెడు మట్టి కూడా మోయాలేదని షర్మిల తీవ్రస్థాయిల విరుచుకుపడ్డారు.